27-08-2025 01:47:31 AM
హైదరాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ బీహార్‌లో చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ విజయవంతంగా కొనసాగుతోంది. మంగళవారం రోజున రాహుల్‌గాంధీ సోదరి వయ నాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొన్నారు. రాహుల్‌గాంధీకి మద్దతుగా ప్రియాంకగాంధీ కలిసి నడిచారు. తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, వాకిటి శ్రీహరి, ఎంపీలు అనిల్ యాదవ్, కడియం కావ్య తదితరులు ఈ ర్యాలీకి హాజరయ్యారు. రాహుల్‌గాంధీకి సంఘీభావం తెలిపారు. సుపౌల్‌లో నిర్వహించిన రాహుల్‌గాంధీ పాదయాత్రకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.