28-08-2025 11:44:03 AM
ఇబ్బందుల్లో మైనార్టీ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు.
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal district) ఖానాపూర్ ప్రాంతంలో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణం ఆనుకుని ప్రవహిస్తున్న రెంకోని వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. దీంతో వాగు పై ఉన్న వంతెన కొట్టుకుపోయి దాని అవతల ఉన్న హైటెక్ సిటీ కాలనీకి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రవాహ ఉధృతి తీవ్రంగా ఉండటంతో ప్రజల అవసరార్థం తాత్కాలిక వంతెన పైపులతో నిర్మించగా గురువారం ఉదయం అది కొట్టుకుపోయింది. కాగా ఆ కాలనీలో మైనారిటీ సంక్షేమ పాఠశాల ,కళాశాల ఉండడంతో ఆ పాఠశాలకు రాకపోకలు సాగించే ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. బుధవారం మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్ ఆధ్వర్యంలో వంతెనకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టినప్పటికీ, పై ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తాత్కాలిక వంతెన పూర్తిగా కొట్టుకు పోయింది.