19-08-2025 01:43:01 AM
22 వరకు ఇదే పరిస్థితి
హైదరాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి) : పలు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 22 వరకు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.
ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ప్రకటిం చింది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్ , మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.