తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి
కేంద్రమంత్రులకు శ్రీధర్‌బాబు విజ్ఞప్తి
అశ్వినీ వైష్ణవ్, కుమారస్వామికి మంత్రి శుభాకాంక్షలు
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన అశ్వినీ వైష్ణవ్, హెచ్‌డీ కుమారస్వామికి తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శుక్ర వారం శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర రైల్వే, ఐటీ మంత్రిగా అశ్వినీ వైష్ణవ్, ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మినిస్టర్‌గా కుమారస్వామి నియమితులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని మంత్రులిద్దరికి శ్రీధర్‌బాబు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా ఏఐ సిటీ, గ్లోబల్ డిజిటల్ స్కిల్ యూనివర్సిటీ, సెమీకండక్టర్ సీఓఈ, సెప్టెంబర్‌లో నిర్వహించబోయే ఏఐ సమ్మిట్ విజయవంతానికి కేం ద్రంతో కలసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నామని,అలాగే సహకారాన్ని కూడా కోరు తున్నట్లు పేర్కొన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచస్థాయి ఆవిష్కరణలతో హైదరాబాద్ గేట్ వేగా మారింద న్నారు. సంపదను సృష్టించడం, ఉపాధి కల్పనలో హైదరాబాద్ గణనీయమైన పాత్రను పోషిస్తోందన్నారు. పరిశ్రమలకు తెలంగాణను అత్యుత్తమ గమ్యస్థానంగా మార్చేం దుకు కేంద్రంతో కలిసి పని చేసేందుకు ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు.






