8 August, 2026 | 3:59 AM

బస్ భవన్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

15-06-2024 01:26 AM

హైదారాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): ఆర్టీసీ అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ట్రైనీ ఐఏఎస్‌లు శుక్రవారం బస్ భవన్‌ను సందర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎండీ వీసీ సజ్జనర్ సంస్థ కార్యకలాపాలను వారికి వివరించారు. రాష్ట్రంలో మహాలక్ష్మిపథకం ద్వారా మహిళలకు ఉచితంగా అందిస్తున్న బస్సు ప్రయాణం, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్టీసీ సీఈవో రవీందర్, జేడీ అపూర్వారావు, ఈడీలు మునిశేఖర్, కృష్ణకాంత్, ఎంసీహెచ్‌హెచ్‌ఆర్డీ సెంటర్ హెడ్ కందుకూరి ఉషారాణి, 2023 ట్రైనీ ఐఏఎస్‌లు ఉమాహారతి, గరిమా నరులా, మృణాల్, సంకేత్, అభిజ్ఞాన్, అజయ్ పాల్గొన్నారు.