12-08-2025 04:49:25 PM
దేవరకొండ: కొండమల్లేపల్లి మండలం జేత్య తండాకు చెందిన కేతావత్ స్రవంతి ఐఐటీలో 1432 ర్యాంక్ తో ప్రతిష్టాత్మక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బిలాయ్(Indian Institute of Technology Bhilai) సీట్ వచ్చింది. వారి తల్లి తండ్రులు నాన్న లారీ డ్రైవర్, అమ్మ పండ్ల బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. కానీ స్రవంతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతిలో 9.5, ఇంటర్ ఎంపీసీలో 994(స్టేట్ ర్యాంక్)తో, ఐఐటీలో 1432 ర్యాంక్ తో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ బిలాయ్ సీట్ సంపాదించింది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని విషయం తెలుసుకొని చదువుకు పేదరికం అడ్డం కావొద్దనీ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరఫున 15,000/- రూపాయలు ఆర్థిక సహాయం మంగళవారం స్రవంతి తల్లికి అసోసియేషన్ సభ్యులు అందించారు. ఈ కార్యక్రమంలో అన్వేష్ రెడ్డి, కేస నరేష్, సాయిచంద్ర, అంజి, ప్రణీత్, శివ, మణిదీప్ తదితరులు పాల్గొన్నారు.