calender_icon.png 12 August, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భద్రాద్రిలో వ్యాపారులకు జీఎస్టీ అవగాహన సమావేశం

12-08-2025 08:37:33 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలంలోని వ్యాపారస్తులకు జీఎస్టీపై అవగాహన కల్పించడానికి జీఎస్టీ అధికారులు మంగళవారం భద్రాద్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్, ది రైస్ అండ్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ హాల్ నందు జీఎస్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జీఎస్టీ సూపర్డెంట్ జి. సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, వ్యాపారస్తులకు జీఎస్టీపై ఉన్న పలు సందేహాలను వివరించారు. అంతేకాకుండా జీఎస్టీ చెల్లింపులు ద్వారా దేశాభివృద్ధికి పాటు పడాలని కోరారు. ఈ సమావేశంలో జీఎస్టీ ఇన్స్పెక్టర్ ఎన్ మధు సీతారామ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్సులు చారుగుండ్ల దేవిప్రసాద్, చారుగుళ్ల శ్రీనివాస్, అకౌంట్ ప్రాక్టీషనర్లు పసుమర్తి సత్యనారాయణ, రాంబాబు, జీఎస్టీ హవల్దార్ శివాలాల్ పలువురు వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు.