calender_icon.png 12 August, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూ మలేరియా వ్యాధుల నిర్మూలనకు కృషి

12-08-2025 08:02:01 PM

కుభీర్: ఈ వర్షాకాలం పూర్తయ్యేంతవరకు గ్రామాల్లో ప్రజలు డెంగ్యూ, మలేరియా వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వం పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్(డ్రై డే)ను నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా(Nirmal District) కుభీర్ మండలం గొడ్సరా, పాంగ్రా, కుప్టి తదితర గ్రామాలలో ఆయన పంచాయతీ కార్యదర్శులతో కలిసి పర్యటించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో అంగన్వాడి టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఆయాలు, ఆశా వర్కర్లతో పలు గ్రామాల్లో ఇళ్ళ ముందు నిలిచి ఉన్న నీటిని, టైర్లు, కుండీలలో నిల్వ ఉన్న నీటిని తొలగింప పరిశీలించి వారిలో అవగాహన కల్పిస్తూ వాటిని తొలగింప చేయాలన్నారు.

ఈ సందర్భంగా ఆయన గ్రామాలలో దోమల బారిన పడకుండా పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని గ్రామస్తులకు సూచించారు. వర్షాకాలంలో వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే తీసుకోవాలని ఇంటి తో పాటు ఇళ్ల పరిసరాలను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలో మురికి కాల్వలను గ్రామంలోని ప్రధాన వీధులను ఆయన పరిశీలించారు. గ్రామాల్లో రోడ్ల వెంబడి నీరు నిలిచిన గుంతల్లో మొరం వేయించి పూడ్చివేయాలని  పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. పిఎస్ లు సాయి, తోట సంజీవ్, అంగన్వాడి టీచర్లు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.