calender_icon.png 12 August, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

12-08-2025 08:40:39 PM

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): వరంగల్ ఆరేపల్లిలోని ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్(Prathima Cancer Hospital)లో సంవత్సరం పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వికాస తరంగిణి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని వ్యాధిపట్ల అవగాహన కల్పించాలని, ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ బి. శ్రీనివాసరావు, డాక్టర్ హరిణి సహాయ సహకారాలతో వికాస తరంగిణి, ప్రతిమ ఫౌండేషన్, ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రి సంయుక్త ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బచ్చ రాధాకృష్ణ, డాక్టర్ తిప్పాని అవినాష్, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, శ్రీమాన్ దయాకర్ రెడ్డి, ఎలగందుల రాజేందర్, తిరుమలరావు, శ్రీనివాస్, డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.