calender_icon.png 12 August, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్ఫేర్ బోర్డు నిధులు కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలి

12-08-2025 08:18:59 PM

అశ్వరావుపేట (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ద్వారా సేకరించిన నిధులను కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న క్లైములను తక్షణమే పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరాజు(CITU State General Secretary Kotam Raju) డిమాండ్ చేశారు. మంగళవారం భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో తాపీ కార్మికుల మండల కమిటీ సమావేశం కనితి సరసారావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కోటం రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను సక్రమంగా కార్మికుల సంక్షేమానికి ఉపయోగించకుండా రాష్ట్ర ప్రభుత్వం సొమ్మొకడిది సోకు మరొకరిది అన్నట్లు నిధులను దారిమల్లిస్తుందని కార్మికులు కు అవసరంలేని వాటిపైన వృధా ఖర్చు పెడుతుందని అన్నారు.

లేబర్ కోడ్ల పేరుతో భవనిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సోషల్ సెక్యూరిటీ కోడ్ లోకి చేర్చి ,ఇప్పుడు అందుతున్న సంక్షేమ పథకాలను కూడా కార్మికుల అందకుండా మోడీ సర్కార్ చేస్తుందని అన్నారు.1996 కేంద్ర చట్టంలో ఉన్న అన్ని స్కీములను రాష్ట్రంలో అమలు చేయటం లేదని, 60 సంవత్సరాలు వయసు పైబడిన వారికి పెన్షన్ కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు గృహవసి తి వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని అన్నారు. ప్రతి ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణాల నుండి సెస్ నిధులు వసూలు చేయడంలో వసూలు అయిన నిధులు కార్మికుల్లో సంక్షేమం కోసం ఖర్చు చేయడంలో కార్మిక శాఖ ఘోరంగా విఫలం చెందిందని అన్నారు.

పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాలకు నిధులు వెంటనే విడుదల చేయాలని ప్రమాద మరణాలకు ఇస్తున్న ఆరు లక్షల రూపాయలు నుండి పది లక్షలకు పెంచాలని సహజ మరణాలకు ఇస్తున్న లక్షల రూపాయల నుండి ఐదు లక్షలకు పెంచాలని 2009 నుండి నమోదు చేసుకున్న కార్మికుల కార్డులు యుద్ధ ప్రాతిపదికన రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ భవన నిర్మాణ కార్మిక సంఘం మండల నాయకులు చెన్నారావు తిరుమల శెట్టి వెంకన్న బాబు శ్రీనివాస్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.