calender_icon.png 12 August, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలు నిర్వహించడం అభినందనీయం

12-08-2025 08:05:59 PM

జిల్లా ప్రధాన జడ్జి యం. నాగరాజు..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడం అభినందనీయమని ప్రధాన జిల్లా జడ్జి యం. నాగరాజు(Chief District Judge M. Nagaraju) అన్నారు. మంగళవారం నల్లగొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా న్యాయవాదులకు, న్యాయశాఖ ఉద్యోగులకు, న్యాయవాద గుమస్థాలకు జిల్లా కోర్ట్ ఆవరణలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరంతరం బిజీగా ఉండే న్యాయవాదులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఫ్యామిలీ కోర్ట్ న్యాయమూర్తి డి దుర్గాప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కట్టా అనంతరెడ్డి, కార్యదర్శి మంద నగేష్, క్రీడాలా కార్యదర్శి జి యస్ యన్ ప్రసాద్, ఇంచార్జిలు గుండ్ల అంజి రెడ్డి, జనిగల రాములు, న్యాయవాదులు,న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు.