calender_icon.png 12 August, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోగిపేటలో జరిగే జిల్లా మహాసభను జయప్రదం చేయండి

12-08-2025 04:53:49 PM

కంగ్టి (విజయక్రాంతి): ఈనెల 17న జరిగే గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా మహాసభలను విజయవంతం చేయాలనీ సీఐటీయు డివిజన్ నాయకులు సతీష్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన కంగ్టి మండలంలోని పంచాయతీ కార్మికులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 వేల జీతాన్ని ఇస్తామన్నా ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన 51జిఓను రద్దు చేయాలని అన్నారు. పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు పెంచి, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ఉద్యోగ భద్రత కల్పించి మరణిస్తే లక్ష రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి ఎక్స్ గ్రేషియా పది లక్షలు ఇవ్వాలని అన్నారు.

కేంద్రం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రాద్దు చేయాలని అన్నారు. కార్మికుల హక్కుల కోసం వారి కుటుంబాల జీవితాలు, జీతాల కోసం తదితర అంశాలపై భవిషత్ కార్యాచరణ మహాసభలో తీర్మానించ బడుతాయని, అందుకే కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనీ అన్నారు. ఈ సమావేశ అనంతరం సీఐటీయు నాయకులు సతీష్ నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శిలుగా నాగమ్మ సిద్దిరామ్, ఉపాధ్యక్షులుగా శంకర్, సహాయ కార్యదర్శిగా ఏషాప్ప, కమిటీ సభ్యులుగా రాజు, మారుతి, రత్నమ్మ, లక్ష్మి, మారుతి, నర్సమ్మ, తులుషమ్మ, గంగారాం తదితరులు పాల్గొన్నారు.