12-08-2025 08:23:46 PM
ఎంపీడీవో విష్ణువర్ధన్..
పాపన్నపేట: రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టిందని మండల పరిషత్ అభివృద్ధి అధికారి విష్ణువర్ధన్(MPDO Vishnuvardhacn) పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా మండల ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. తనం మాత్రం కార్యక్రమంలో భాగంగా మండలలంలోని అన్ని గ్రామాల్లో అవసరాల మేరకు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు.
ఇందులో భాగంగానే ప్రతి ఇంటికి ముక్కలు పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత తీసుకున్నప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, ఎపిఓ మహిపాల్ రెడ్డి,టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరితో పాటు ఉపాధ్యాయులు నాగరాజు, కృష్ణకాంత్, అంజగౌడ్, రమేష్ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు