12-08-2025 08:11:39 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): రామకృష్ణాపూర్ బీఆర్‌ఎస్‌వీ(BRSV) నాయకులను మంగళవారం పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాల సాధన కోసం నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఛలో హైదరాబాద్ గాంధీ భవన్ ముట్టడి లాంటి నిరసన కార్యక్రమనికి వెళ్లకుండా బీఆర్‌ఎస్‌వీ నాయకులు రామిడి లక్ష్మీకాంత్, చంద్ర కిరణ్, గోనె రాజేందర్, కురుమ దినేష్, మాచర్ల కుమార్, కాంపల్లి శ్రీకాంత్ లను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని అన్నారు. ఎన్నికల్లో వాగ్దానం చేసి నిరుద్యోగులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రెండేళ్లు గడిచిన ఇప్పటివరకు ఉద్యోగల భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగుల బతుకులతో ప్రభుత్వం అడుకుంటుదాని అన్నారు.