calender_icon.png 12 August, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిఆర్పీ చెల్లించాలని బ్యాడ్జీలతో సింగరేణి వైద్యుల నిరసన..

12-08-2025 08:31:21 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి సింగరేణి వైద్యులు మంగళవారం ఆస్పత్రి ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎగ్జీ క్యూటివ్ లకి పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే(పీఆర్పీ)నీ తక్షణమే యాజమాన్యం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేశారు. విధులకు హాజరైన వైద్యులు బోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనకి దిగారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడారు. గత మూడు సంవత్సరాలుగా యాజమాన్యం పీఆర్పీ చెల్లించలేదన్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పీఆర్పీ చెల్లింపులో జాప్యం తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగరాణి, సందీప్, అలేఖ్య, పావని, మౌనిక, ఎం నరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.