గురుకులాల్లో.. గోరింటాకు సంబరాలు
22-07-2026 12:00 AM
మహబూబాబాద్, జులై 21 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని విద్యార్థినుల్లో పెంపొందించేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలికల గురుకుల కళాశాలలు/ పాఠశాలల్లో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు సంబరాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వివిధ బాలికల గురుకుల పాఠశాలలో సామూహిక గోరింటాకు సంబరాలను ఏర్పాటు చేస్తూ, గోరింటాకు ప్రాముఖ్యతను, తెలంగాణ సంస్కృతిని పెంపొందించే విధంగా అధ్యాపకులు విద్యార్థినులకు వివరిస్తున్నారు. హనుమకొండ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల కళాశాల/ పాఠశాలలో నిర్వహించిన ఆషాడమాసం గోరింటాకు వేడుకల్లో విద్యార్థినిలు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని, గోరింటాకు పెట్టుకున్నారు.






