13-08-2024 01:51:06 AM
వాషింగ్టన్: తమ ఆరోపణలను ఖండి స్తూ సెబీ చీఫ్ మాధబి బచ్ చేసిన ప్రకటన మరిన్ని సంక్లిష్ట ప్రశ్నలు లేవనెత్తుతోందని అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ సంస్థ పేర్కొంది. సెబీ చీఫ్ స్పందనపై ఆ సంస్థ ఆదివారం రాత్రి మరోసారి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వరస ట్వీట్లతో స్పందించింది. మాధబి స్పందనలో ఆమెకు బెర్ముడా/మారిషస్ ఫండ్స్ ఉన్నాయన్న విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయని పేర్కొంది. దీంతోపాటు ఆ ఫండ్స్ ఆమె భర్త ధవల్ చిన్ననాటి మిత్రుడు నడుపుతున్న విషయం కూడా తేలిందని పేర్కొంది. ప్రస్తుతం అతడు అదా నీ గ్రూపులో డైరెక్టర్‌గా చేస్తున్నారని వెల్లడించింది.
అదానీ విషయంలో దర్యాప్తు చేసే బాధ్యతను సెబీకి అప్పగించారని, వాటి ల్లో బచ్ వ్యక్తిగత పెట్టబడులు, ఇతర స్పాన్స ర్ల నిధులు ఉన్నాయని వెల్లడించింది. ఇది విరుద్ధ ప్రయోజనాల అంశం కిందకు వస్తుందని ఆరోపించింది. సెబీలో నియామకంతో ఆమె 2017లో స్థాపించిన కంపెనీలు నిద్రాణమైపోయాయని పేర్కొంది. 2019లో ఆమె భర్త సదరు సంస్థల బాధ్యతను స్వీకరించారని వెల్లడించింది. ఆ కంపెనీ ఇప్పటికీ మాధబి సొంత కంపెనీగా పేర్కొంది. కన్సల్టెంగ్ రెవెన్యూను అది సంపాదిస్తోదని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్ మాధబి పురిపై అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన ఆరోపణలు చేయడం తెలిసిందే.
అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధబి పురి, ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ తాజాగా ఆరోపించింది. అదానీకి చెందిన మారిషస్, ఆఫ్‌షోర్ షెల్ సంస్థల వివరాలను తెలుసుకోవడంలో సెబీ ఆసక్తి చూపకపోవడం తమను ఆశ్చర్యపరిచిందని పేర్కొంది. ఈ ఆరోపణలను సెబీ ఛైర్‌పర్సన్ మాధ బి పురి బచ్ తోసిపుచ్చారు. హిండెన్‌బర్గ్ ఆరోపణలను ఖండిస్తూ మాధబి, ఆమె భర్త ధావల్ బచ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. హిండెన్బర్గ్ ఆరోపణలు ఆధారరహితమని, ఎటువంటి నిజాలు లేవన్నారు. బచ్‌త్తో ఎటువంటి వాణిజ్య సంబం ధాలు తమకు లేవని మరోవైపు అదానీ గ్రూప్ స్పష్టంచేసింది.
మాధబికి సర్కారు దన్ను!
న్యూఢిల్లీ: సెబీ చైర్‌పర్సన్ మాధబి బుచ్, అదానీ గ్రూపు మధ్య ఉన్న సంబంధాలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన తాజా ఆరోపణలపై కేంద్రప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఎలా ంటి చర్యలు తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే మాధబికి సమర్థురా లిగా ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అదీగాక సెబీ చైర్‌పర్సన్ ఎంపికైన తొలి మహి ళగానూ గుర్తింపు ఉంది. 2022లో ఈ పదవిలో మూడేళ్ల కాలానికి నియమితురాలైన ఆమె 2025 మార్చితో టర్మ్ ముగు స్తుంది. ప్రభుత్వం కోరుకుంటే మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగించే అవకాశముంది. 1966లో జన్మించిన మాధబి ఢిల్లీ సెయింట్ స్టీఫెన్ కళాశాలనుంచి గణితంలో డిగ్రీ, ఐఐఎం అహ్మదా బాద్ నుంచి ఎంబీఏ చేశారు.
ధవల్ బుచ్‌తో 21 ఏళ్లకు వివాహం చేసుకున్నారు. సెబీలో ౨౦౧౭లో పూర్తిస్థాయి సభ్యురాలుగా నియమించబడడానికి ముందు మాధబి 12 ఏళ్ల పాటు ఐసీఐసీఐ సహా వివిధ సంస్థల్లో దేశ విదేశాల్లో పలు హోదా ల్లో పనిచేశారు. అయితే ఓ ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తి సెబీలో సభ్యురాలుగా చేరడం అందరి దృషిని ఆకర్షించింది. సాధారణంగా ఆల్‌ఇండియా సర్వీస్‌కు చెందిన వ్యక్తులను ఆ పదవిలో నియమిస్తారు. కానీ ఆమె సమర్థత దృష్ట్యా ఈ పదవి దక్కింది.
సభ్యురాలుగా ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత చైర్‌పర్సన్‌గా ఉన్న సమయంలో కానీ ఆమెపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. అయితే మూడు రోజుల క్రితం ఒక్కసారిగా హిండెన్‌బర్గ్ పేల్చిన బాంబుతో ఆమె పేరు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. మార్కెట్ వర్గాలు, పారిశ్రామికవేత్తలుకూడా మాధబికి అండగా నిలస్తున్నారు.
మాధబి, ఆమె భర్తపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, దురుద్దేశ పూరితంగా చేసినవేనని ప్రభుత్వం భావిస్తోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు గతంలో హిండెన్‌బర్గ్‌కు సెబీ నోటీసులు ఇచ్చినందునే ఇప్పుడు ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. భారతీయ మార్కెట్ల నుంచి తక్షణ లాభాలు పొందాలని హిండెన్‌బర్గ్ భావిస్తోందని, అయితే సెబీ, కేంద్రప్రభుత్వం పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తు న్నాయని కూడా స్పష్టం చేశాయి.
ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే అద్భుతంగా రాణిస్తున్న మన మార్కెట్లను ధ్వంసం చేయడమే హిండెన్‌బర్గ్ ఉద్దేశమని, అందుకనే ఇలాం టి ఆరోపణలు చేస్తోందని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు సెబీ సూచనలతో మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాలకే పరిమితమయ్యాయి. అదానీ గ్రూపు షేర్లు ప్రారంభంలో భారీగా నష్టపోయినా మార్కెట్‌లో సానుకూల వాతావర ణంతో పుంజుకుని స్వల్ప నష్టాలతో సరిపుచ్చుకోవడం గమనర్హం. రాబోయే రోజుల్లో వ్యవహారం ఎలా మలుపు తిరగబోతోందన్న విషయాన్ని అటుంచితే ప్రస్తుతానికి ఈ వివాదం ఆశించినంత సంచలనం కాలేదనేది నిజం.