17 April, 2026 | 3:23 AM

నువ్వే నీ ఉలి.. నువ్వే నీ శిల..

17-04-2026 12:00 AM

హీరో నిఖిల్ సిద్ధార్థ ఇప్పుడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘స్వయంభూ’తో రాబోతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ల నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్త, నభా నటేశ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ భారీ పీరియడ్ యాక్షన్ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ‘రా రా ధీవర’ విడుదలైంది.

‘రారా ధీవర.. లేరా లేవరా.. విజృంభించరా.. స్వప్నం సాధించరా.. నువ్వే నీ ఉలి.. నువ్వే నీ శిల.. నీలో శక్తిని శిల్పంగా మార్చరా..’ అంటూ సాగుతోందీ గీతం. రవి బస్రూర్ స్వరపర్చిన ఈ గీతాన్ని రామజోగయ్య శాస్త్రి రాయగా, సంతోష్ వెంకీ పాడారు. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్; డీవోపీ: కేకే సెంథిల్‌కుమార్; ఎడిటర్: తమ్మిరాజు; ప్రొడక్షన్ డిజైన్: ఎం ప్రభాహరన్, రవీందర్.