calender_icon.png 13 September, 2024 | 1:13 AM

నార్సింగి పీఎస్‌లో కేసు.. హీరో రాజ్తరుణ్కు రిలీఫ్

08-08-2024 05:10:58 PM

హైదరాబాద్: టాలీవుడ్ లో లావణ్య, రాజ్ తరుణ్ కేసు సంచలనం రేపింది. ఈ కేసులో హీరో రాజ్ తరుణ్ కు తెలంగాణ హైకోర్టులో గురువారం ఊరట లభించింది. రాజ్ తరుణ్ కు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు  చేసింది. రాజ్ తరుణ్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనను రాజ్ తరుణ్ మోసం చేశారని లావణ్య ఫిర్యాదు చేసింది. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్ తరుణ్ పై కేసు బుక్ అయింది. దీంతో రాజ్ తరుణ్ విచారణకు హాజరుకావాలని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. దీంతో హైకోర్టు రాజ్ తరుణ్ కు షరుతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.