calender_icon.png 25 August, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరభద్రుడి సన్నిధిలో హైకోర్టు జడ్జిలు

25-08-2025 12:00:00 AM

గుమ్మడిదల, ఆగస్టు 24 : బొంతపల్లి శివారులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వీరభద్ర స్వామిని హైకోర్టు జడ్జి, సంగారెడ్డి జిల్లా పోర్టు పోలియో జడ్జి సురేపల్లి నందా, జిల్లావాసి, హైకోర్టు జడ్జి అనిల్ కుమార్ లు ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాగా ఆలయ చైర్మన్ మద్ది ప్రతాపరెడ్డి, ఆలయ కార్యనిర్వాహణ శశిధర్ గుప్త ఆధ్వర్యంలో హైకోర్టు జడ్జిలకు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా జడ్జీలు స్వామి వారిని దర్శించుకొని వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ హైకోర్టు జడ్జిలకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.