10 August, 2026 | 2:40 AM

పైలట్ గ్రామంలోనే ‘ఇందిరమ్మ’ ఫెయిల్

10-08-2026 01:55 AM
  1. ఇందిరమ్మ ఇళ్లకు ఇంద్రజాలం
  2. 328 ఇళ్లు మంజూరు.. 
  3. గృహప్రవేశం అయ్యింది 8దే..
  4. పైలట్ ప్రాజెక్టులోనే అధికారుల నిర్లక్ష్యం 

తాండూరు, ఆగస్టు 9,(విజయ క్రాంతి ) ఇల్లు లేని పేద కుటుంబాల సొంతింటి కల నెరవేర్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అత్యం త ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’ఇందిరమ్మ ఇల్లు’ పథకానికి పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రామంలోనే పథకం అమలు తీరు అధ్వానంగా మారింది.  వికారాబాద్ జిల్లా పెద్దే ముల్ మండలం మంబాపూర్ గ్రామానికి పైలెట్ ప్రాజెక్టు కింద చేసి 328 ఇళ్లు మం జూరు అయ్యాయి, 134 ఇళ్ల నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అట్టాహాసంగా ముగ్గులు వేసి పనులు ప్రారంభిం చారు .

కానీ  ఇప్పటివరకు కనీసం 100 ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభం కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేసేందుకు మోడల్గా నిలవాల్సిన పైలట్ ప్రా జెక్ట్ గ్రామంలోనే పనులు ముం దుకు సాగకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం గొప్పగా ప్రకటించిన పథకం క్షేత్రస్థాయిలో అమలు కాకపోతే ఎలా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ‘మంజూరైన 328 ఇళ్లలో పునాది పడింది కేవలం 103 ఇళ్ళకే. మిగతావి కాగితాలకే పరిమితం‘ అ య్యాయని స్థానికులు అంటున్నారు.. 

అ ధికారుల పర్యవేక్షణ లోపం వల్లే పనులు ముందుకు సాగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన గ్రా మంలోనే పనులు  నత్త నడకన సాగుతుంటే మిగతా గ్రామాల పరిస్థితి ఏంటని ప్రజలు నిలదీస్తున్నారు. దీనిపై హౌసింగ్ శాఖ అధికారులు వెంటనే స్పందించి, లబ్ధిదారులకు అవగాహ న కల్పించి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ స్వ యంగా పర్యవేక్షించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పథకం నీరు గాడుతోందని  ప్రభుత్వానికే చెడ్డపేరు వచ్చే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వి షయమై మండల హౌసింగ్ ఏఈ ఆకాంక్షను వివరణ కోరగా ఇల్లు నిర్మించుకోవాలని ల బ్ధిదారులకు అనేకమార్లు సూచించామ ని.. కానీ కొంతమంది మాత్ర మే ఇళ్ల నిర్మా ణం పనులు ప్రారంభించారని.. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని.. మండలంలో గుడిసెలో నివసిస్తున్న 37 కుటుంబాలకు రెండవ దశలో ఇండ్లు మంజూరు చేస్తామని అన్నారు.