విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య
గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం
విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ని ఇంటర్‌కు అప్‌గ్రేడ్ చేస్తాం
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ఎల్బీనగర్, జూలై 23: ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే సీఎం రేవం త్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియ ల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్‌ని ఇంటర్ కు అప్ గ్రేడ్ చేస్తామన్నారు. విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్లో 202627 విద్యా సంవత్సరానికి ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్ & అమెనిటీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్‘ గురువారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు స్టూడెంట్ కిట్లు, అవసరమైన అమెనిటీస్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతోపాటు అవసరమైన సౌకర్యాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
సరూర్ నగర్‌లోని విక్టోరియా మెమోరియ ల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్నా రని అభినందించారు. అండర్ 16లో ఖోలో ఇండియా, స్కూల్ గేమ్స్, లో జాతీయ, రాష్ట్రస్థాయిలో పథకాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మ న్ మల్‌రెడ్డి రామ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గణేశ్, భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణ, నర్సింహ, విక్టోరియా మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపా ల్ లక్ష్మీపార్వతి, వైస్ ప్రిన్సిపాల్ నర్సింహరెడ్డి, స్కూల్ సెక్రటరీ సాల్మాబాను, పీఈటీ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.






