శ్రీ వందన హాస్పిటల్ లో' హై రిస్క్ ప్రసవం
- తల్లిబిడ్డలు క్షేమం
సిద్దిపేట,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 'శ్రీ వందన'మల్టీ స్పెషాలీటీ ఆస్పత్రికి గుండె సంబంధిత సమస్యతో ఉన్న నిండు గర్భిణి ప్రసవం కోసం వచ్చింది. గర్భిణి రిపోర్టులు పరిశీలించిన వైద్యురాలు బొజ్జ వందన హై రిస్క్ ప్రసవం గుర్తించారు. గర్భిణి గతం నుండి వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్న ఆస్పత్రి వైద్యులు హైదాబాద్ పట్టణానికి వెళ్లాలని సూచించారు. దీంతో గర్భిణి ప్రసవం కోసం వైద్యురాలు బొజ్జ వందనను సంప్రదించడంతో శనివారం గర్భిణికి హై రిస్క్ ప్రసవం నిర్వహించారు. మగ బిడ్డకు జన్భనివ్వగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్టు ఆస్పత్రి మేనేజర్ నాగారాజు తెలిపారు. హై రిస్క్ ప్రసవాన్ని నిర్వహించి తల్లిబిడ్డను క్షేమంగా అందించిన వైద్యురాలు బొజ్జ వందన, ఆస్పత్రి సిబ్బందికి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
తక్కువ ఖర్చులో హై రిస్క్ ప్రసవాలు..
రాష్ట్ర రాజధాని కంటే తక్కువ ఖర్చుతో హై రిస్క్ ప్రసవాలు నిర్వహించి ప్రజల్లో సుస్థిర స్థానం పొందుతున్నట్టు వైద్యురాలు వందన తెలిపారు. ఈ నెలలో నాలుగు సాధారణ ప్రసవాలు నిర్వహించామని..హెచ్ఐవీ, హిస్టోరక్టమీ, వీడీఆర్ఎల్ కలిగిన ప్రసవాలు, ట్యూబెక్టమీ వంటి రిస్క్ కేసులను తక్కువ ఖర్చుతో నిర్వహిస్తున్నామని వైద్యురాలు వందన తెలిపారు.






