తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాం
సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య
కోదాడ,(విజయ క్రాంతి): వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు త్రాగునీరు, నిత్య అవసరాలకు అవసరమైన నీరుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంబంధిత అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు చర్యలు తీసుకుంటున్నామని సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య అన్నారు. మండల పరిధిలోని గణపవరం గ్రామంలో రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని తాగునీటి సమస్య రాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రామీణ జల సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు డిఈ దేవబిక్షం, మిషన్ భగీరథ డి ఈ అభినయ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవి నాయక్ లను గ్రామానికి ఆహ్వానించి వినతి పత్రం అందించిన సర్పంచి స్నేహ దుర్గయ్య.
ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న తాగునీటి పరిస్థితులను వారికి వివరించి, బోర్ బావులు, చేతి పంపులను, వాటర్ ట్యాంకులను అధికారులతో కలిసి ప్రత్యక్షంగా పరిశీలించారు. అలాగే అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు, చేతి పంపులు ఏర్పాటు చేయుటకు ఎస్టిమేట్లు ఇవ్వాలని అధికారులను అభ్యర్థించడం జరిగింది.
గ్రామ ప్రజలకు వేసవి కాలంలో త్రాగునీటి సమస్యలు రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులకు వివరించడం జరిగిందని అన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. నీటి సమస్యను త్వరగా పరిష్కరించుకునేలా ప్రజలు సహకరించి ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






