పీ.జీ. కళాశాల ప్రిన్సిపాల్ కామ క్రీడలు!
మెమో, టిసి కోసం వచ్చే పురుష విద్యార్థులపై వేధింపులు
స్వలింగ సంపర్క వికృత చేష్టలపై విసిగిన విద్యార్థి
డెకాయిట్ ఆపరేషన్‌తో ప్రిన్సిపాల్ అఘాయిత్యాలు బట్టబయలు
అర్ధరాత్రి కళాశాలలోనే కామ వాంఛకు యత్నం
పరారీలో ప్రిన్సిపాల్.. పీఎస్‌లో ఫిర్యాదు
కొల్లాపూర్ పీజీ కళాశాలలో హై టెన్షన్. నాగర్ కర్నూల్ / కొల్లాపూర్ రూరల్ జులై 8 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పీజీ కళాశాలలో మంగళవారం అర్ధరాత్రి హై టెన్షన్ వాతావరణం నెలకొంది పూర్తి చేసుకున్న విద్యార్థుల పట్ల ఆ కళాశాల ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు స్వలింగ సంపర్కం సెక్స్ కోరికలు తీర్చాలంటూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నట్లు బట్టబయలైంది.
అప్పటికే రెండుసార్లు ఆ ప్రిన్సిపల్ వేధింపులకు బలైన విద్యార్థిని టి సి కోసం మరోసారి వేధింపులకు గురి చేయడంతో తోటి విద్యార్థులతో కలిసి మంగళవారం అర్ధరాత్రి డెకాట్ ఆపరేషన్ చేశారు. ప్రిన్సిపల్ కోరిన విధంగానే విద్యార్థి నడుచుకుంటూ మరో విద్యార్థి చేత వీడియో తీయించడంతో ఈ బండారం మొత్తం బయటపడింది.
స్వలింగ సంపర్కం కోరికలు పెంచుకున్న ఆ ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్ జగిత్యాలకు చెందిన పీజీ పూర్తి చేసిన ఓ విద్యార్థిపై వేధింపులకు గురి చేయడంతో తాళలేక తన అంగాన్ని నోటిన కరవడంతో ఆ కళాశాల ప్రిన్సిపాల్ గదులు తీవ్ర రక్తస్రావమయ్యాయి. విషయం కాస్త బయటికి పొక్కడంతో పోలీసులు, విద్యార్థులు ప్రిన్సిపల్ కోసం వెతక సాగారు. ఇలాంటి ఘటనలో తరచూ జరుగుతూనే ఉన్నాయని బయటికి చెప్పుకోలేక చాలామంది విద్యార్థులు మనోవేదనకు గురయ్యారని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అదే కళాశాల తోటి అధ్యాపకులు సదరు ప్రిన్సిపల్ ఆకృత్యాలను సమర్థిస్తూ ఉండడంతో ఈ వ్యవహారంలో ఇతరులతో కూడా సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఆందోళనలు ఇబ్బందులు జరగకుండా పోలీసులు ఈ విషయంలో గట్టిగా బందోబస్తూ ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కళాశాల ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు కళాశాల ప్రిన్సిపల్ పై వెంటనే సస్పెన్షన్ వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కళాశాల ప్రిన్సిపాల్ ను వైద్య పరీక్షల నిమిత్తం నాగర్కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు.






