10 May, 2026 | 1:56 PM

Breaking News

కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •   నేను మీ అందరివాణ్ని.. మద్ధతు ఇచ్చిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: తమిళనాడు సీఎం విజయ్   •   తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •  

యూజీసీ గైడ్‌లైన్స్‌పై స్పందించిన ఉన్నత విద్యామండలి

27-01-2025 06:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వీసీల నియామకంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ మార్గదర్శకాలపై ఉన్నత విద్యామండలి స్పందించింది. యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి(Higher Education Council Chairman Balakista Reddy) పేర్కొంది. యూజీసీ గైడ్‌లైన్స్‌(UGC Guidelines) వల్ల వీసీల నియామకం కేంద్రం చేతిలోకి వెళ్తుందని, వీసీలుగా బ్యూరోక్రాట్స్ పై నియమించాలనుకోవటం సరికాదని బాలకిష్టారెడ్డి వెల్లడించారు. యూజీసీ గైడ్‌లైన్స్‌ ప్రైవేటైజేషన్ ను ప్రోత్సహిస్తుందని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ వ్యవహరిస్తున్నదని ఆక్షేపించారు. రాష్ట్ర యూనివర్శిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని ఆరోపించారు. యూనివర్సిటీలు స్వతంత్రంగా ఉండాలి. యూజీసీ గైడ్‌లైన్స్‌పై తాము ఒక కమిటీ వేసుకున్నామని ఆయన తెలిపారు. కమిటీ ఇచ్చే రిపోర్టును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందన్నారు. వర్సిటీల్లో ఖాళీల భర్తీపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.