11 April, 2026 | 6:37 PM

ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు..

16-08-2024 01:12 AM

బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిపై 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని మోదీ అన్నారు. భారత్ ఎల్లప్పుడూ బంగ్లాదేశ్ పురోగతిని ఆశిస్తుం దని, త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి రావాలని కోరుకున్నారు.

రాజకీయ వారసత్వం లేని లక్ష మంది యువతను ప్రజాప్రతినిధులుగా చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. రాజకీయా ల్లో తాజా రక్తం రావాలని ఆశించారు. తద్వారా కుల, వంశ రాజకీయాలు దేశం లో పూర్తి అంతమవుతాయన్నారు. 

సామాన్యులను దోచుకునే సంప్రదాయాన్ని ఆపేందుకు అవినీతిపరుల గుండెల్లో భయాన్ని సృష్టించాలని తాను కోరుకుంటున్నట్లు మోదీ చెప్పారు. దీని కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్ఠ కన్నా జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. 

దేశవ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు జరగాల్సిన అవసరముందని ప్రధాని కోరారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రగతికి కొన్ని అడ్డంకులు వచ్చాయని తెలిపారు. దేశంలో ఏదో ఒకచోట ప్రతి మూడ్నెల్ల నుంచి ఆర్నెల్ల కు ఎన్నికలు జరుగుతున్నాయని, ఇది ఖర్చును కూడా పెంచుతోం దని తెలిపారు. 

దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని పెంపొందించడం, వైద్యుల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని మోదీ తెలిపారు. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లను పెంచే ప్రణాళికలను ప్రకటించారు. లక్షలు ఖర్చు చేసి విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని, ఈ పరిస్థితిని మార్చుతామని హామీ ఇచ్చారు