calender_icon.png 17 November, 2025 | 4:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్రా యాత్రికుల మృతి పట్ల కేసీఆర్ సంతాపం

17-11-2025 02:49:32 PM

హైదరాబాద్: సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు(Saudi bus crash) ప్రమాదంలో పలువురు తెలంగాణ వాసులు మృతి చెందడం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యి అందులో ప్రయాణిస్తున్న 45 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందజేయాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించిన కేసీఆర్ వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.