గోల్డ్ మైన్స్ కోసం బిడ్డింగ్
06-06-2024 01:11 AM
పోటీలో హింద్ జింక్, జిందాల్ పవర్
న్యూఢిల్లీ, జూన్ 5: రాజస్థాన్‌లోని రెండు గోల్డ్ మైన్స్‌ను చేజిక్కించుకునేందుకు హిందుస్థాన్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్‌లు పోటీ పడుతున్నాయి. బంగారం గనుల తవ్వకానికి ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన వేలం ప్రక్రి య ఇటీవల ముగిసింది. వేదాంత్ గ్రూప్‌నకు చెందిన హింద్ జింక్, జిందాల్ పవర్, జేకే సిమెంట్‌తోపాటు రామ్‌ఘడ్ మినరల్స్, హిరాకుడ్ నేచురల్ రిసోర్సెస్, పొద్దార్ డైమండ్ కంపెనీలు రాజస్థాన్‌లోని భూకియాజాగ్‌పురా గోల్డ్ బ్లాక్, కంక్రియా గారా గోల్డ్ బ్లాక్‌ల బిడ్డింగ్‌లో పాలుపంచుకున్నాయి.






