27 April, 2026 | 5:27 AM

బోడుప్పల్‌లో ఘనంగా హిందూ సమ్మేళనం

27-04-2026 02:28 AM

మేడిపల్లి, ఏప్రిల్ 26(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని లక్ష్మీనగర్ బస్తీలో శ్రీ గాయత్రీమాత అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ‘హిందూ సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని లక్ష్మీనగర్, గాయత్రీనగర్ ఫేస్-1, ఫేస్-2, ఆంజనేయ నగర్, సాయి మారుతీ నగర్, వేంకటేశ్వర కాలనీ, కేశవ నగర్ కాలనీల వాసుల సంయుక్త ఆధ్వర్యంలో కన్నుల పండువగా ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వక్తలుగా ముప్పారపు వెంకట సింహాచల శాస్త్రీ, చిన్నము రాజు, డాక్టర్ పీ లలిత వాణిలు తమ ప్రసంగతో హిందు సమాజం, ప్రజల మధ్య ఐక్యత, ఆధ్యాత్మికతను, హిందూ ధర్మ రక్షణ, సనాతన ధర్మ విశిష్టత, గురించి వివరించారు.

ఈ సమ్మేళనంలో ఈ పరిసర కాలనీల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయ వంతం చేశారు. అనంతరం అమ్మవారికి సామూహిక ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీల ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.