08-11-2025 12:00:00 AM
హాకీ క్రీడా శతాబ్ది ఉత్సవాల్లో కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్, నవంబర్ 7 (విజయక్రాం తి): హాకీ క్రీడా భారత క్రీడల గౌరవానికి చిహ్నం అని, క్రమశిక్షణ, దేశభక్తి, సమన్వయ భావనను ప్రతిబింబించే ఆట హాకీ అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. దేశంలో హాకీ క్రీడ ప్రారంభమై 100 ఏళ్లు పూర్తున సందర్భంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడి యంలో శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ విగ్ర హానికి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించి, అనంతరం హాకీ ఇండియా శతాబ్ది లోగోను ఆవిష్కరించి క్రీడా పోటీలను ప్రారంభించారు. అదేవిధంగా జిల్లా హాకీ అభివృద్ధికి విశేష కృషి చేసిన సీనియర్ హాకీ క్రీడాకారులను కలెక్టర్ శాలువాలు కప్పి సన్మానిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ... యువత క్రీడలలో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తోందని తెలిపారు.
జిల్లాలోనూ హాకీ క్రీడలో పలువురు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటినట్లు గుర్తుచేశారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా యువజన, క్రీడాశాఖ అధికారి శ్రీనివాస్, హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ద న్ రెడ్డి, ఏ.టి.డి.ఓ నిహారిక, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, కోచ్లు, అధికారులు, క్రీడా పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.