08-11-2025 12:00:00 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 7(విజ యక్రాంతి): జాతీయ కుటుంబ ప్రయోజనా పథకం క్రింద అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావుతో కలిసి అన్ని మండలాల తహసీల్దార్లతో పలు అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం క్రింద కుటుంబ పెద్ద మరణించిన కుటుంబాలకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, అర్హత కలిగిన కుటుంబాల నుండి తహసిల్దార్లు దరఖాస్తులు స్వీకరించి సబ్ కలెక్టర్/ రాజస్వ మండల అధికారి కార్యాలయాలకు సమర్పించాలని తెలిపారు. జిల్లా లో సుమారు 3 వేల కుటుంబాలు ఆర్థిక సహా యం పొందే అవకాశం ఉందని తెలిపారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలని సూచించారు.
మీ - సేవా కేం ద్రాల ద్వారా వివిధ రకాల ద్రవపత్రాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా ధ్రువపత్రాలు జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని తెలి పారు. అవసరమైన ప్రాంతాలలో నూతన మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిఫారసు చేయాలని తెలిపారు. ప్రధానమంత్రి జన్ మన్ పథకంలో భాగంగా పివిటిజిలకు నివాస గృహాలు, ఇందిరమ్మ ఇండ్ల పనులలో సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తి చేసే విధంగా దృష్టి సారించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేయూత పింఛ న్ విభాగం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రామకృష్ణ, తహసీల్దార్లు పాల్గొన్నారు.