08-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, నవంబర్ 7(విజయక్రాంతి): శ్రీ కామాక్షి సమేత ఏకామ్రనాథుడి దయ ప్రజలపై సంపూర్ణంగా ఉండాలని బీఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్‌లోని శ్రీ కామాక్షి సమే త ఏకామ్రనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహించిన నవగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా గత రెండు రోజులుగా రుత్వికులచే మహా కుంభాభిషేకలు నిర్వహించగా శుక్రవారం నిర్వహించిన నవగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ఏకామ్రనాథ దేవాలయంలో స్వామి వారికి , నవగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మాణిక్య నగర్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బి.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్, ఖలీల్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, జయేందర్ రెడ్డి, మధు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, నాగరాజు, ఆలయ కమిటీ సురేష్, సలహాదారులు రామేశ్వర్ రెడ్డి, ఇంద్రసేన రెడ్డి, నారాయణ రెడ్డి, బీమప్ప, దామోదర్ రెడ్డి, కాలనీ సీనియర్లు కెబిఆర్ ప్రసాద్, డి.పోచయ్య, గోపాల్ రెడ్డి, రాంరెడ్డి, బిఆర్‌ఎస్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దూదిమెట్ల సోమేష్ యాదవ్ పాల్గొన్నారు.