20-11-2025 04:27:16 PM
పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం(Gitam Deemed University) గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో పండుగ సీజన్ ను స్వాగతించింది. క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్ నేతృత్వంలో ఆతిథ్య విభాగం నిర్వహించిన ఈ కార్యక్రమం, క్రిస్మస్ యొక్క వెచ్చదనం, స్ఫూర్తిని జరుపుకోవడానికి వివిధ విభాగాలకు చెందిన విద్యార్థులందరినీ ఒకచోట చేర్చింది. ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడే సంప్రదాయమైన కేక్ మిక్సింగ్ వేడుక ఆశ, ఆనందం, కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. గీతంలో, ఈ వేడుక ఒక పాక శాస్త్ర ఆచారానికి మించి జరిగింది. ఎండిన పండ్లు, గింజలు (నట్స్), సుగంధ ద్రవ్యాలు, వివిధ రసాల ఉల్లాసమైన మిశ్రమంలో పాల్గొనడానికి విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది చేతులు కలిపారు.
కృతజ్జత, ఐక్యతను ప్రతిబింబించే గొప్ప పండుగ కేక్ లను తయారు చేయడానికి ఈ మిశ్రమాన్ని కొన్ని వారాల పాటు ఊరబెడతారు. సమాజం, భావోద్వేగం, భాగస్వామ్యం యొక్క ఆనందాన్ని ఈ వేడుక సూచిస్తుంది’ అని అంబికా ఫిలిప్ అభిప్రాయపడ్డారు. కేక్ అనేది ప్రేమతో తయారు చేసిన తినదగిన పదార్థం. ఐక్యత, స్నేహం, పండుగ ఉత్సాహాన్ని ఈ వేడుక ప్రతింబిస్తుంద’ని ఆమె తెలిపారు. ఈ కేక్ మిక్సింగ్ వేడుక ద్వారా ప్రాంగణంలో క్రిస్మస్ వేడుకలను అధికారికంగా ప్రారంభించినట్టయింది. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, డైరెక్టర్-స్కూల్ ఆఫ్ టెక్నాలజీ & డీన్-కోర్ ఇంజనీరింగ్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు ఆతిథ్య బృందంతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. మొత్తంమీద ఇది వేడుకల స్ఫూర్తిని పెంచడమే గాక, ఈ సీజన్ లోనే చిరస్మణీయమైన కార్యక్రమంగా నిలిచిపోయింది.