calender_icon.png 20 November, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

20-11-2025 04:23:07 PM

హౌసింగ్ డిఈ మునీందర్

మందమర్రి, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని వివిధ గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని హౌసింగ్ డిఈ మునీందర్ సూచించారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గురువారం మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గందె రామచందర్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధి దారులు ఇంటి నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ప్రభుత్వం అందించే బిల్లులు పొంది ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ జ్యోత్స్న, పంచాయతీ కార్యదర్శి రమేష్,  ఇందిరమ్మ కమిటీ సభ్యులు కామెర బాలయ్య, లబ్ధిదారులు పాల్గొన్నారు.