calender_icon.png 20 November, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరు వైట్‌ఫీల్డ్స్‌లో ఆల్ఫాహారం

20-11-2025 04:24:51 PM

సేవా సమితి స్వాముల ఆశీర్వచనాలు

సనత్‌నగర్ (విజయక్రాంతి): ఈరోజు ఉదయం బెంగళూరు వైట్‌ఫీల్డ్స్‌లో భక్తి శ్రద్ధలతో ఆల్ఫాహారం కార్యక్రమం జరిగింది. నరేష్ (చింటు) గురుస్వామి తండ్రి టి. మచగిరి, కోడలు బి. కీర్తిక జన్మదిన వేడుకను పురస్కరించుకుని అయ్యప్ప స్వాములకు ప్రత్యేకంగా ఆల్ఫాహారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శభరి గిరీశ మహా పాదయాత్ర సేవా సమితికి చెందిన అనేకమంది అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. స్వాములు భక్తిపూర్వకంగా ఆల్ఫాహారం స్వీకరించి, కీర్తికకు దీర్ఘాయుష్షు, సుఖశాంతులు, అయ్యప్ప స్వామి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ఆశీర్వచనాలు అందించారు.

కుటుంబ సభ్యులు స్వాములకు వినయపూర్వకంగా సేవలు అందిస్తూ, పాదయాత్ర సేవా సమితితో ఉన్న ఆధ్యాత్మిక బంధాన్ని మరోసారి మరింత బలపరిచారు. జన్మదిన శుభసందర్భంగా స్వాముల ఆశీస్సులు పొందడం తమ కుటుంబానికి ఎంతో పుణ్యఫలమని మచగిరి తెలిపారు. సమాజంలో ఆధ్యాత్మిక సేవలు, అయ్యప్ప భక్తి ప్రచారంలో ముందుండే శభరి గిరీశ మహా పాదయాత్ర సేవా సమితి స్వాములు ఇటువంటి కార్యక్రమాలకు హాజరై ఆశీర్వదించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.