20-11-2025 04:20:43 PM
బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని బీసీ జేఏసీ జిల్లా చైర్మన్ రూపునర్ రమేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలను వంచించి రిజర్వేషన్ ఇస్తానంటూ ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రిజర్వేషన్ కాకుండానే ఎన్నికలకు వెళ్తామంటూ ప్రచారం చేయడం సరికాదన్నారు రానున్న రోజుల్లో బీసీలు కాంగ్రెస్, బిజెపిలకు తగిన బుద్ధి చెప్తారన్నారు. బిజెపి ఎంపీలు తక్షణమే బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రస్తావని తేవాలన్నారు. లేని పక్షాన బిజెపి ఎంపీలను రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తామని హెచ్చరించారు.బీసీల ఓట్లతో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బిజెపిలు బీసీలను మోసం చేస్తున్నాయన్నారు బీసీలకు 42% రిజర్వేషన్ చేయకుంటే ఊరుకునేది లేదన్నారు.
బీసీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బీసీలపై సమితి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని 42% బీసీ రిజర్వేషన్ కోసం రానున్న రోజుల్లో జిల్లాలో ఉదృతంగా ఉద్యమిస్తామని బీసీ రిజర్వేషన్ కాకుండా ఎన్నికల నిర్వహిస్తే బీసీలు ఎన్నికలను బహిష్కరించాలన్నారు .ఈ కార్యక్రమంలో రాజ్యాధికార పార్టీ రాష్ట్ర నాయకులు కోట వెంకన్న, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వైరగడే మారుతి పటేల్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లోబడి లవ్ కుమార్, బీసీ జేఏసీ జిల్లా వైస్ చైర్మన్ మాచర్ల శ్రీనివాస్,పి ఎస్ యు రాష్ట్ర కార్యదర్శి కోట ఆనంద్ యాదవ్, రెడ్డిక సంఘం జిల్లా అధ్యక్షుడు అనిముల శంకర్, పద్మశాలి సంఘం ఆసిఫాబాద్ పట్టణ అధ్యక్షులు అనుమడ్ల శ్రీకాంత్ ,బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కిరణ్, బీసీ సంక్షేమ సంఘం ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు సిరికొండ సాయికృష్ణ, గంగ పుత్ర సంగం జిల్లా అధ్యక్షులు పర్రె యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం నాయకులు కావుడే మోతిరావ్, శెండే నాందేవ్, నీకోడే హనుమంతు, జెఎసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.