calender_icon.png 20 November, 2025 | 6:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు రైతు ఆత్మహత్యాయత్నం

20-11-2025 04:28:26 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దాయాదుల మధ్య భూ పరిష్కారం విషయంలో ఎమ్మెల్యే అనుచరులు మధ్యవర్తిత్వం వహిస్తూ అడ్డుపడ్డారన్న ఆరోపణతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు గురువారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు  బిజినపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన శంకర్ గౌడ్ అనే రైతు కు అదే మండలం వసంతాపూర్ గ్రామ శివారులో వారసత్వంగా వచ్చిన పొలంతో పాటు స్వయంగా కొనుగోలు చేసిన పట్టా పొలం నుండి 6 గుంటల భూమిని అవసరం నిమిత్తం అమ్ముకునేందుకు బేరం కుదుర్చుకున్నాడు.

అట్టి భూమిని అమ్ముకోనివ్వకుండా స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి అనుచరులుగా పేరు చెప్పుకుంటున్నకొందరు నేతలు అడ్డుకోవడంతో మనస్థాపం చెందాడు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి 108 సాయంతో జనరల్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంలో ఎమ్మెల్యే అనుచరులు మాత్రం ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.