4 March, 2026 | 5:02 AM

గుండ్లపోచంపల్లిలో ఘనంగా హోలీ

04-03-2026 01:06 AM

మేడ్చల్ అర్బన్, మార్చి 3 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి పట్టణంలో ప్రజలు హోలీ పండుగ సంబరాలను జరుపుకున్నారు. మంగళవారం వివిధ పార్టీలకు చెందిన నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ అలింగణం చేసుకుంటూ హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. హోలీ పండుగ సందర్భంగా రసాయనాలతో కూడిన రంగులను కోడిగుడ్లతో కొట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా హోలీ పండుగ జరుపుకున్నారు.

అంతేకాకుండా హోలీ పండుగ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిసి చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అనంతరం గుండ్లపోచంపల్లి కార్పొరేషన్ పట్టణ ప్రజలకు మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దొడ్ల మోహన్ ముదిరాజ్.కావేరి శేఖర్.నవీన్ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.