4 March, 2026 | 7:05 PM

సామరస్యానికి ప్రతీకగా హోలీ పండుగ

04-03-2026 12:00 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, మార్చి 3,(విజయక్రాంతి) హోళీ పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలో నిర్వహించిన రంగుల వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హోళీ ఐక్యత,

ఆనందానికి ప్రతీక అని పేర్కొన్నారు.హోలికా దహనం సంప్రదాయాన్ని స్మరించుకుంటూ చెడుపై మేలుకు గెలుపును సూచించే పండుగగా హోళీని అభివర్ణించారు. ప్రజలు సురక్షితంగా, పర్యావరణ హితంగా వేడుకలు జరుపుకోవాలని సూచించారు.