4 March, 2026 | 5:24 PM

సుల్తానాబాద్‌లో కలర్ ఫుల్.. సంబరంగా హోలీ వేడుకలు..

04-03-2026 12:00 AM

సుల్తానాబాద్ , మార్చి 3 (విజయ క్రాంతి): అవని రంగుల మాయమైంది. సప్త వర్ణాలు పరుచుకుంది. హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం  సుల్తానాబాద్ పట్టణంలో హోలీ ఘనంగా జరుపుకున్నారు, రంగులు పూసుకుంటూ... సంబరాల్లో మునిగి తేలారు... చిన్న పెద్ద తేడా లేకుండా  రంగుల జాతరలో ఉత్సాహంగా పాల్గొన్నారు... ప్రజా ప్రతినిధులు ..అధికారులు.. నాయకులు...

పలు సంఘాల వారు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, పట్టణం తోపాటు మండలంలోని గ్రామాల్లోనూ హోలీ వేడుకలు అంబరాన్ని అంటాయి ,  జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత, సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ ఆధ్వర్యంలో  వాకర్స్ వేడుకలను ఘనంగా నిర్వహించారు,

సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ , వాసవి క్విన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది, ఇం దులో  పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొన్నారు, ఆర్యవైశ్య భవన్ లో అందరూ కలిసి చేసిన నృ త్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి, అన్ని వాడల్లోనూ హోలీ  సంబరాలు ఘనంగా జరుపుకో గా ... సుల్తానాబాద్ పట్టణం కలర్ ఫుల్ గా కనిపించింది.