కళలతోనే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం
- రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య
- విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఘనంగా ‘కళాకృతియ’ఆర్ట్ ఫెస్టివల్
హైదరాబాద్, ఏప్రిల్ 12(విజయక్రాంతి):కళలతోనే పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని, విద్యార్థులు కేవలం మార్కులు, ర్యాంకులకే పరిమితం కాకుండా తమలోని సృజనాత్మకతను వెలికితీయాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ అడ్వైజర్, రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య సూచిం చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞా న్స్ యూనివర్సిటీలో ‘కళాకృతియ’ ఆర్ట్ ఫెస్టివల్ అత్యంత వేడుకగా జరిగింది. స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ (SAC) ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో విద్యార్థులు తమ అద్భు తమైన కళా ప్రతిభను చాటారు.
ఆర్ట్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు స్వయంగా గీసిన రంగురంగుల పెయింటింగ్‌లు, పెన్సిల్ స్కెచ్ ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హ్యాండ్‌మేడ్ వస్తువులు, మట్టితో చేసిన కుండలు, గృహ అలంకరణ సామగ్రిని విద్యార్థులు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు. నెయిల్ ఆర్ట్, మెహందీ, లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలతో క్యాంపస్ మైదా నం పండుగ వాతావరణాన్ని తలపించింది.
కళలతో పాటు ఆహార ప్రియుల కోసం ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాల్స్ ఈ వేడుకలో సందడిని మరింత పెంచాయి. కార్యక్ర మం సందర్భంగా యూనివర్సిటీ అడ్వైజర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ విద్యార్థులు తమలోని కళాత్మక నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ‘కళాకృతియ’ వంటి వేదికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. కళల పట్ల ఆసక్తి పెంచుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సృజనాత్మక ఆలో చనలు పెరుగుతాయని తెలిపారు.
విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివ ర్సిటీ ఎప్పుడూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. ఇంజనీరిం గ్, సైన్స్ విద్యతో పాటు ‘కళాకృతియ’ కళా ఉత్సవాలు విద్యార్థుల్లో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభను బయటకు తీస్తాయని పేర్కొన్నారు.
ఈ ‘కళాకృతియ’ వేదిక ద్వారా విద్యార్థులు తమ ఊహాశక్తికి రూపం ఇచ్చి అద్భుతమైన కళాఖండాలను సృష్టించారని చెప్పారు. భవిష్యత్తులో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆయా విభాగాల హెచ్‌ఓడీలు, అధ్యాపక బృందం, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.




