వరదల సమయంలో హోంగార్డుల సేవలు హర్ష నియం
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో సంభవించిన భారీ వర్షాలు, వరదల సమయంలో హోంగార్డులు చేసిన సేవలు హర్షనీయమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బంది, హోంగార్డులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కామారెడ్డిలో వరదలు ముంచేతాయని అన్నారు. ఆ సమయంలో పోలీసులు, హోంగార్డులు చేసిన సేవలు ప్రజలు గుర్తుంచుకునేలా నిలిచాయని ప్రశంసించారు.
ఆపద సమయంలో సేవ చేసినప్పుడే తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను రక్షించిన తీరు అభినందనీయం అన్నారు. ఇదే స్పూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఎస్పి పేర్కొన్నారు. నిజాయితీతో పని చేసిన వారికి తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయన్నారు. గుర్తింపుతో పాటు రివార్డులు కూడా లభిస్తాయి అని తెలిపారు. అనంతరం హోంగార్డులకు రెయిన్ కోట్స్, జరికిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు పోలీస్ అధికారులు, హోంగార్డులు పాల్గొన్నారు.




