19-09-2025 04:56:37 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి) ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకత్వ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా నిర్వహించే ధర్నా లో భాగంగా శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే సీ అండ్ డబ్ల్యూ డీపో షెడ్ ఎదుట లోకోపైలట్ క్రూ లాబీ ఎదుట స్వచ్చందంగా కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచ్ చైర్మెన్ ఎస్.నాగరాజు మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల పట్ల నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే రైల్వే కార్మికులకు ఎనిమిదవ వేతన సంఘం అమలు చేయాలని డిమాండ్ చేశారు.రైల్వే లోకో పైలట్లకు కేంద్ర ప్రభుత్వం కిలో మీటర్ కు 25 శాతం అలవెన్స్ చెల్లించాలని, వీటి నుంచి 70 శాతం ఇన్కమ్ టాక్స్ మినహాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విలువలతో కూడిన వేతన సంఘాన్ని వెంటనే ప్రకటించి జనవరి 2026 నుండి అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బ్రాంచ్ సెక్రటరీ జి. సాంబశివుడు,ట్రెజరర్ షోకిన్ మీనా, నాయకులు నిరాజ్ అగర్వాల్,కెశంకరయ్య,యూనియన్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.