calender_icon.png 19 September, 2025 | 6:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోలేటిలో టిఎన్టియుసి చేపట్టే ధర్నాలు విజయవంతం చేయండి

19-09-2025 05:14:17 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవడంతో పాటు సింగరేణి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టిఎన్టియుసి ఆధ్వర్యంలో ఈనెల 24న గోలేటి జిఎం కార్యాలయం ముందు చేపట్టనున్న నిరాహారదీక్షకు విజయవంతం చేయాలని టిఎన్టియుసి ప్రధాన కార్యదర్శి టి.మణిరాం సింగ్ కోరారు.  శుక్రవారం బెల్లంపల్లి కార్యాలయంలో ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ప్రగతికి పునాదిగా నిలిచిన ఉద్యోగులు 72 మిల్లీమీటర్ల లక్ష్యాని కి గాను 69.06 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించి 96% టార్గెట్ ను నమోదు చేశారన్నారు.

2024, 25 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి నికర లాభాలను ప్రకటించి కార్మికులకు లాభాల వాటా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. 40% లాభాల్లో భాగస్వామ్య వాటాను కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులకు పట్టించి ఎప్పుడు చెల్లిస్తారో తెరపాలని ఇప్పటికే సింగరేణి సి అండ్ ఎండి కి విన్నవించినట్లు తెలిపారు. నూతన ట్రాన్స్ఫర్ విధానం రద్దు, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతన చట్టం రూ 26 వేలకు తగ్గకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా అమలు చేయాలని కోరారు.

సింగరేణి క్వార్టర్లను పర్మినెంట్ కార్మికులకు, ఖాళీగా ఉన్న క్వార్టర్లను కాంట్రాక్ట్ కార్మికులకు అలాట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు గద్దల నారాయణ, జిల్లా అధ్యక్షులు జీవరత్నం, మందమరి ఏరియా కార్యదర్శి వెంకటస్వామి, పాష, చంద్రమౌళి, పంతం యాదగిరి, గోలేటి ఇన్చార్జి గుర్రం గంగయ్య, ఎస్ ఎస్ పాండే, బొల్లు మల్లయ్య, గంగాధర్ గౌడ్, రాజయ్య, రమేష్, మేకల నర్సింగ్, మాసాడి గోపాల్, బొల్లు సత్యనారాయణ, ఎం .నవీన్, ఎస్ .రవికుమార్ పాల్గొన్నారు.