31 March, 2026 | 10:07 PM

హోమ్ ఓటింగ్‌ను వినియోగించుకోవాలి

03-05-2024 01:40 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, మే 2(విజయక్రాంతి): అర్హులంతా హోం ఓటింగ్‌ను వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ సిటిజెన్, దివ్యాంగులు, అత్యవసర సర్వీసులున్న వాళ్లు హైదరాబాద్ జిల్లాలోనే దాదాపు 129 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారని తెలిపారు. ఓటర్లందరూ మే 13న ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.