calender_icon.png 22 January, 2026 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్షన్ కామెడీ మొగుడు

22-01-2026 01:31:37 AM

విశాల్ కథానాయకుడిగా దర్శకుడు సుందర్ సీ రూపొందిస్తున్న తాజాచిత్రం ‘పురుషన్’. విశాల్ 36వ సినిమాగా వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘మొగుడు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రస్తుతం చిత్రీకరణ జరపుకొంటున్న ఈ సినిమాను ప్రకటిస్తూ చిత్రబృందం బుధవారం ఓ ప్రోమోను విడుదల చేసింది. దాదాపు 5 నిమిషాల నిడివితో ఉన్న ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కామెడీ యాక్షన్ మేళవించి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్టు ఈ ప్రోమో చూస్తే తెలుస్తోంది.

ఇందులో తమన్నా కథానాయిక కాగా, హాస్య నటుడు యోగిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో తమన్నా.. భర్తకు ఆర్డర్స్ వేసే భార్యగా కనిపించింది. విశాల్ ఓ వైపు ఇంట్లో పనులు చేస్తూనే యాక్షన్‌తో అదరగొట్టారు. ‘మొగుడులా ఉండటం ముఖ్యం కాదు.. మొగుడు మొగుడులా ఉండటమే ముఖ్యం. అర్థమైందా అత్తయ్యా..’ అంటూ ఓ టీవీ సీరియల్ హీరోగా యోగిబాబు చేసిన కామెడీ నవ్వులు పంచుతోంది. ఈ చిత్రానికి సంగీతం: హిప్‌హాప్ తమిజా; డీవోపీ: గోపీ అమర్‌నాథ్; ఎడిటర్: రోజర్; ప్రొడక్షన్ డిజైన్: గురురాజ్; నిర్మాత: ఏసీఎస్ అరుణ్‌కుమార్; స్క్రీన్ ప్లే, డైలాగ్స్: వెంకట్ రాగవన్; దర్శకత్వం: సుందర్ సీ.