రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
03-09-2026 | 10:51am
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ(Mahabubabad town) పరిధిలోని గాయత్రి గుట్ట కు చెందిన వరం శెట్టి దీపక్ (19) అనే యువకుడు కేసముద్రం రైల్వే స్టేషన్(Kesamudram Railway Station) కు సమీపంలో గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన విషయాన్ని తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.






