20-06-2025 06:54:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని టీపీసీసీ మైనారిటీ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ అజర్ హుస్సేన్(TPCC Minority General Secretary Mohammad Azhar Hussain) ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లాకు చెందిన అంబడి రాజేశ్వర్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శుభ సందర్భంగా సన్మానం చేశారు. ఆయనకు పూలమాలతో సన్మానం చేసి బోకే అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా మైనారిటీ అధ్యక్షులు జునైద్ మెమన్, పట్టణ మైనార్టీ అధ్యక్షులు మతిన్, తాజా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఐజాజ్ హుస్సేన్, ఖిజర్, అర్షద్ క్కురేషి, సలీం ఖాన్ ఇమ్రాన్ ఉద్దీన్, అర్షద్, నవీద్, సజ్జడ్, అహటేషం, ఫాజిల్, అమీన్ పటేల్, మొహ్సిన్ చావుష్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానం చేయడం జరిగింది.