05-05-2025 12:57:15 AM
గద్వాల, మే 04 ( విజయక్రాంతి ) : గద్వాల జిల్లా కేంద్రం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం పట్టణంలో ఆరెకటిక సంఘంకు చెం దిన పదవ తరగతి, ఇంటర్ ఫలితాలల్లో ఉత్తమ ఫలితాలు సాదించిన విద్యార్థులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు భవి ష్యత్తులో కూడా మంచిగా చదువుకొని ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్ణయించుకొని అత్యున్నత స్థాయికి ఎదగాలి మీ తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులకు గద్వాల ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజీవ్ రెడ్డి, ఆరెకటిక సంఘం జిల్లా అధ్యక్షుడు అభిలాష్, నాయకులు నరేష్, సూర్య ప్రకాష్, విజయ్, ప్రీతం, తదితరులు పాల్గొన్నారు.